రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులు జారీకి ముందుగా ప్రతి కుటుంబానికి సంబంధించిన ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా చేయాలని నిర్ణయించింది. మొదట ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు విధించిన ప్రభుత్వం, పలు కారణాల వల్ల ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయిన కార్డుదారుల కోసం ఇప్పుడు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే – ఈ ఈ-కేవైసీ ప్రక్రియ ద్వారా బోగస్ కార్డులను తొలగించి, రేషన్ బియ్యం ఇతరుల చేతికి వెళ్లకుండా నియంత్రించడమే లక్ష్యం. ఈ ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే జనవరిలో ప్రారంభించింది. మొదట్లో అధికారులు ప్రకటనల ద్వారా స్పష్టంగా తెలియజేశారు – గడువు తేదీలోపు ఈ-కేవైసీ పూర్తి చేయని కార్డుదారులకు రేషన్ సరుకులు అందవని హెచ్చరికలు ఇచ్చారు.

ఇక చాలామంది ఈ-కేవైసీ ఆన్‌లైన్‌లో చేయాలని ప్రయత్నించారు. అయితే కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రేషన్ డీలర్ల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది డీలర్లు సేవలకు డబ్బు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఇంకా, విద్యార్థులు ఇతర నగరాల్లో ఉండటం, షాపులు క్లోజ్ అయ్యే సమయం వలన కూడా ప్రజలు ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు.

ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అందరికీ మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో జూన్ 30వ తేదీ వరకు ఈ-కేవైసీ ప్రక్రియకు గడువును పొడిగించింది. ప్రజలు రేషన్ డీలర్లు లేదా ఎండీయూ వాహనాల వద్ద ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

మరిన్ని సమస్యలు తలెత్తకుండా ప్రతి eligible కార్డుదారుడు ఈ గడువులోపు తమ ఈ-కేవైసీని పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ చేయకపోతే భవిష్యత్‌లో రేషన్ సరుకులు పొందే అవకాశాన్ని కోల్పోవచ్చు.

Read More : భీమవరంలో మతిస్థిమితం లేని వ్యక్తి స్వీయహాని, ప్రాణాలు కోల్పోవడం

One thought on “రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

Comments are closed.