సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ముగిసింది – సీబీఐ క్లోసర్ రిపోర్ట్ దాఖలు

sushant singh rajput and rhea chakraborty

బాలీవుడ్‌లో ప్రతిభావంతమైన నటుడిగా పేరుగాంచిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన నటించిన చిత్రాలు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. అయితే, కోవిడ్ కాలంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, ఇది కుట్రేననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసును సీబీఐ వివిధ కోణాల్లో విచారణ జరిపిన అనంతరం, తాజాగా క్లోసర్ రిపోర్ట్‌ను దాఖలు చేసింది.

అధికారిక సమాచారం ప్రకారం, సుశాంత్ కేసులో రెండు వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు జరిగింది. మొదటిది, సుశాంత్ తండ్రి రియా చక్రబోర్తి మరియు ఆమె కుటుంబంపై చేసిన కేసు. రెండవది, రియా, సుశాంత్ కుటుంబంపై వేసిన కేసు.

విశ్లేషణ అనంతరం, సీబీఐ తన నివేదికను సమర్పించింది. ఇందులో, సుశాంత్ మరణానికి కుట్ర సంబంధిత ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, రియా చక్రబోర్తి కుటుంబానికి పూర్తిగా క్లీన్‌చిట్ ఇచ్చింది.

ఈ నివేదికపై రియా చక్రబోర్తి న్యాయవాది సతీష్ మనేషిండే స్పందిస్తూ, “సీబీఐ అన్ని కోణాల్లో విచారణ జరిపి ఈ కేసును ముగించిందని మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని పేర్కొన్నారు. అలాగే, రియా ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేస్తూ, “27 రోజులపాటు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. అనంతరం ఆమెకు బెయిల్ లభించింది” అని వివరించారు.

సుశాంత్ మరణ వార్త బయటకు రాగానే, రియాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. నెటిజన్లు ఆమెనే దీనికి కారణమని తిట్టిపట్టారు. ఆమె ద్వారా సుశాంత్‌కు మాదకద్రవ్యాలు చేరాయని, అందువల్లే ఈ విషాదం చోటుచేసుకుందనే విమర్శలు వెల్లువెత్తాయి.

దాదాపు నాలుగేళ్లపాటు సాగిన ఈ విచారణ చివరకు ముగిసింది. 2020 ఆగస్టులో, సుశాంత్ తన ముంబయి బాంద్రా అపార్ట్‌మెంట్‌లో మృతిచెందిన విషయం విదితమే.

Read More

One thought on “సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ముగిసింది – సీబీఐ క్లోసర్ రిపోర్ట్ దాఖలు

Comments are closed.