పహల్గామ్ ఉగ్రదాడిలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అనన్య నాగళ్ల!

Ananya Nagalla visits Madusudhan Rao's family after Pahalgam terror attack

పహల్గామ్ ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మధుసూధనరావు కూడా ఉన్నారు. పహల్గామ్ విహారయాత్ర కోసం వెళ్ళిన మధుసూధనరావు ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంతాపాన్ని కలిగించింది.

ఈ ఘటనపై పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఉగ్రదాడిని ఖండించారు. అయితే, సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించిన వారిలో ఏకంగా మృతుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఓ తెలుగమ్మాయి ఉండటం ప్రత్యేకం. ఆమె అనన్య నాగళ్ల.

నెల్లూరుకు చెందిన అనన్య నాగళ్ల, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూధనరావు ఇంటికి వెళ్లి, వారి కుటుంబాన్ని ఓదార్చింది. ఆ సందర్భంలో ఆమె మృతుని భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులకు ఓదార్చి ధైర్యం ఇచ్చింది. అనంతరం, ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

అనన్య ట్వీట్ చేస్తూ, “పహల్గామ్ సంఘటన నన్ను తీవ్రంగా బాధించింది. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలిసి వచ్చాను. మతం పేరుతో హత్యలు చేయడం నేను అంగీకరించలేను. మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొంది.

Read More


One thought on “పహల్గామ్ ఉగ్రదాడిలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అనన్య నాగళ్ల!

Comments are closed.