అనంతపురం జిల్లా, సోమందేపల్లిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివాహం జరిగిన రోజే ఒక నవవధువు ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని ముగించుకుంది.
సోమందేపల్లికి చెందిన హర్షిత (23) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈమెకు బీఎండబ్ల్యూ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నాగేంద్రతో సోమవారం వివాహం జరిగింది. మధ్యాహ్నం పెళ్లి తంతు ముగిసిన తర్వాత రాత్రికి ఆమె తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళ్ల పారాణి ఆరకముందే హర్షిత ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read More : ఏపీలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

One thought on “వివాహం జరిగిన రోజే నవవధువు ఆత్మహత్య”
Comments are closed.