అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ చిన్నారి విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. తిండి తినడమే ఆ బాలుడి చివరి క్షణమైమారింది. తపోవన్ నివాసి అభిషేక్ మరియు అంజనమ్మ దంపతుల కుమారుడు విశాల్ (2) తన తల్లి ఇచ్చిన దోసె తింటూ అనుకోకుండా ప్రాణాలు కోల్పోయాడు. నిన్న ఉదయం అంజనమ్మ తన కుమారుడికి దోసె వేసిచ్చింది. తింటుండగా ఓ ముక్క బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే శ్వాస ఆగిపోయి ఆయన ఒక్కసారిగా కిందపడిపోయాడు. గమనించిన తండ్రి అభిషేక్, హుటాహుటిన అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే పరిస్థితి విషమంగా మారి చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
ఈ ఘటనతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. “పిల్లాడి కడుపునింపాలని చూడగా అదే తిండి ప్రాణం తీసింది” అంటూ తల్లి అంజనమ్మ కన్నీటి పర్యంతమవ్వడం స్థానికులను భావోద్వేగానికి గురిచేసింది. చిన్నారి మరణం తపోవన ప్రాంతాన్ని విషాదంలోకి నెట్టింది.
Read More : కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య

One thought on “అనంతపురంలో విషాదం.. దోసె ముక్కతో చిన్నారి మృతి”
Comments are closed.