వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు.

గుంటూరులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం నిర్వహించిన “వెన్నుపోటు దినం” నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనలో అధికారులతో గొడవకు దిగిన అంబటి రాంబాబు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర పదజాలంతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబటి రాంబాబుకు, ఒక పోలీసు అధికారికి మధ్య తీవ్ర వాదోపవాదం జరిగింది. ఒకరినొకరు వేలు చూపించుకుంటూ ఘర్షణకు దిగారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబు సహా మరికొందరు వైసీపీ నేతలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read More : ఆర్‌సీబీ విజ‌యోత్స‌వం మ‌ర‌ణ‌మయ‌మైంది.

One thought on “వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు.

Comments are closed.