అమరావతి రాజధాని పనుల ప్రారంభంపై కీలక ప్రకటన
అమరావతి (AP Capital) నిర్మాణ పనులపై ఎప్పుడెప్పుడు స్పష్టత వస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నాటికి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనుల్లో పాల్గొననున్నారని అధికారులు తెలిపారు.
ఎన్నికల కమిషన్ (EC) ఆదేశాల కారణంగా టెండర్ల ఖరారులో కొంత ఆలస్యం జరిగింది. టెండర్లు పిలుచుకోవచ్చని, కానీ ఖరారు చేయకూడదని EC స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటివరకు CRDA, ADC సంస్థలు దాదాపు 62 పనులకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించాయి. సుమారు ₹40,000 కోట్ల విలువైన నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. అదనంగా, మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు అధికారులు వెల్లడించారు.

One thought on “మార్చి 15 నుంచి పనులు ప్రారంభం”
Comments are closed.