అలిపిరి బాంబు దాడి సూత్రధారి నంబాల కేశవరావు హతం.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక మావోయిస్టు నేత, ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు హతమయ్యారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలకు సూత్రధారిగా ఉన్న బసవరాజు మృతి పోలీస్ శాఖ విజయంగా చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన నంబాల కేశవరావు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అనేక ఘటనల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.

బసవరాజు… 2003లో అప్పటి సీఎం నారా చంద్రబాబునాయుడుపై తిరుపతి అలిపిరిలో జరిగిన బాంబు దాడికి ప్రధాన సూత్రధారిగా నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ దాడిలో చంద్రబాబు తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన ఘట్టంగా చరిత్రలో నిలిచింది.

ఈ కీలక మావో నేత హతన వార్తను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన “మావోయిస్టు వాదానికి ఇది పెద్ద దెబ్బ. దేశంలోని ప్రతి ప్రాంతాన్ని మావోయిస్టు ఉగ్రవాదం నుండి శుద్ధి చేయాలన్న మా సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది” అని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా వ్యాఖ్యానించారు.

దేశ భద్రతను కాపాడేందుకు పనిచేస్తున్న సైనికుల ధైర్యానికి, దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలను అణిచివేయాలన్న కేంద్ర ప్రభుత్వ కట్టుబాటుకు ఇది ప్రతీకగా నిలుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read More : పెద్దపులిపై తిరగబడి బిడ్డను కాపాడింది

One thought on “అలిపిరి బాంబు దాడి సూత్రధారి నంబాల కేశవరావు హతం.

Comments are closed.