ఒడిశా జైల్లో అరుదైన వివాహం…

ఒడిశాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అత్యాచార కేసులో జైలులో ఉన్న సూర్యకాంత్ బెహెరా… తనపై కేసు వేసిన బాధిత యువతిని కోర్టు అనుమతితో జైలు ప్రాంగణంలో వివాహం చేసుకున్నాడు.

ఇద్దరి కుటుంబాల సమ్మతితో పిటిషన్ దాఖలైన అనంతరం, కోర్టు పెళ్లికి అనుమతి మంజూరు చేసింది. అధికారులు నిఘాలో, జైలు ఆవరణలోనే ఈ పెళ్లి కొనసాగింది.

అయితే కేసులో తుది తీర్పు వెలువడే వరకు సూర్యకాంత్ బెహెరా జైలులోనే కొనసాగనున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.

ఇలాంటివి అరుదుగా కనిపించే ఉదంతాలుగా భావిస్తున్నారు.

Read More : కేదార్‌నాథ్ ఆలయం ముస్తాబవుతోంది: 8 క్వింటాళ్ల పూలతో శోభించిన ఆలయం

One thought on “ఒడిశా జైల్లో అరుదైన వివాహం…

Comments are closed.