టాలీవుడ్ అక్కినేని కుటుంబంలో పెళ్లి ఘనత ప్రారంభమైంది. యువ హీరో అఖిల్ అక్కినేని త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారని సమాచారం. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనబ్ రవ్‌డ్జీతో అఖిల్ వివాహం జరగనుందని, అది జూన్ 6న నిర్వహించనున్నారని వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఈ జంట ప్రేమలో ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం నవంబర్ 26న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనంతరం ఇద్దరూ కలిసి పలు విహారయాత్రలకు వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
తాజాగా వీరి పెళ్లి తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జోరుగా సాగుతున్నట్టు సమాచారం. అఖిల్, జైనబ్ పెళ్లి వేడుక అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రపంచంలోనూ ఆసక్తిని రేపుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
Read More : అదృష్టాన్ని వడ్డింపుగా మార్చుకున్న రుక్మిణీ వసంత్..

One thought on “అక్కినేని అఖిల్ పెళ్లి బృందావనం”
Comments are closed.