అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని దిగ్భ్రాంతి

అహ్మదాబాద్‌లో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర సంఘటనపై ఆయన సానుభూతి ప్రకటిస్తూ బాధిత కుటుంబాలకు పరామర్శ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తనకు అధికారులు పూర్తి సమాచారం అందిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనలో మొత్తం 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నప్పటికీ, అందులో 53 మంది బ్రిటన్ పౌరులే ఉన్నట్లు సమాచారం. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల వ్యవధిలోనే విమానం అదుపుతప్పి కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కీర్ స్టార్మర్ సోషల్ మీడియాలో ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ… ‘‘భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో లండన్ బయలుదేరిన విమానం కూలిపోయిన దృశ్యాలు చూసి హృదయం పిండిపడింది. ఆ విమానంలో అనేక మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు. అధికారులు పరిస్థితిపై నిరంతరం సమాచారం అందిస్తున్నారు. ఈ కష్ట సమయంలో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యుల కోసం నా ప్రార్థనలు కొనసాగుతున్నాయి’’ అని పేర్కొన్నారు.

ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదని అధికారులు తెలిపారు. బాధితుల వివరాలు, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read More : రష్యా డ్రోన్లను కూల్చేందుకు ఉక్రెయిన్ వినూత్న పథకం.

One thought on “అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని దిగ్భ్రాంతి

Comments are closed.