పోస్టుమార్టం నివేదికలో దారుణమైన నిజాలు

పాకిస్థాన్ నటి, మోడల్ హుమైరా అస్ఘర్ అలీ మరణం కేసు తాలూకు వివరాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. తొమ్మిది నెలల క్రితం చనిపోయిన ఆమె మృతదేహాన్ని కేవలం వారం క్రితమే గుర్తించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన పోస్టుమార్టం నివేదికలో విషాదకర విషయాలు బయటపడ్డాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న సమయంలో ఆమె మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ముఖ్యమైన అవయవాలు గుర్తించలేనంతగా శరీరం శోషించబడింది. ఆమె ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా నాశనం అయిందని నివేదికలో పేర్కొన్నారు. విశ్లేషణల ప్రకారం, శరీరంలోని కండర కణజాలం పూర్తిగా నశించిపోయింది. ఎముకలు తాకగానే విరిగిపోయే స్థితిలో ఉన్నాయి. మెదడులోని పదార్థం పూర్తిగా కుళ్లిపోయినట్టు, అంతర్గత అవయవాలు నల్లగా మారిపోయినట్టు వెల్లడైంది. కీళ్లలో మృదులాస్థి కనిపించకపోవడం, శరీర అవశేషాల్లో పురుగుల ఉనికిని గుర్తించడం పోలీసుల దర్యాప్తుకు కీలకంగా మారింది.

ఆమె జుట్టులో గోధుమరంగు పురుగులు ఉన్నప్పటికీ, తెల్లని పురుగులు లేవని నివేదిక పేర్కొంది. శరీరం పూర్తిగా కుళ్లిపోవడంతో ఆమె మరణానికి గల కచ్చితమైన కారణం వెల్లడించలేకపోయారు. డీఎన్ఏ, టాక్సికాలజీ పరీక్షలు మిగిలిన వివరాలను వెల్లడించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విచిత్ర మరణం పాకిస్థాన్‌లో కలకలం సృష్టిస్తోంది. హుమైరా మరణం వెనుక కారణాలేంటన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More : మయన్మార్‌లో వైమానిక దాడి.. 23 మంది మృతి .

One thought on “పోస్టుమార్టం నివేదికలో దారుణమైన నిజాలు

Comments are closed.