అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో అక్కడి విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భద్రతా కారణాల వల్ల అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అన్ని విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి అధికారిక నోటీసు వచ్చే వరకు ఎలాంటి టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు నిర్వహించబోమని అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయంలో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

Read More : 110 మంది ప్రాణాలు కోల్పోయారు
