మహారాష్ట్రలోని సతారా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఉన్న ఓ ఆటో డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. జరిమానా తప్పించుకోవడానికి ఆటోను ఆపకుండా తీసుకెళ్లి, అడ్డుపడిన మహిళా కానిస్టేబుల్‌ను ఈడ్చుకుంటూ వెళ్లాడు. దీంతో ఆందోళన చెందిన స్థానికులు వెంటపడి ఆటోను ఆపి డ్రైవర్‌ను బాగా కొట్టి పోలీసులకప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే… సతారా నగరంలోని ఓ కూడలిలో సోమవారం ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మహిళా కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్ ఒక ఆటోను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, డ్రైవర్ దేవ్ రాజ్ కాలే మద్యం మత్తులో ఉండటంతో ఆటోను ఆపకుండా దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ను ఈడ్చుకుంటూ వెళ్లాడు. వెంటనే స్థానికులు స్పందించి కొద్దిదూరంలో ఆటోను అడ్డుకున్నారు. డ్రైవర్‌ను చితకబాదిన తర్వాత పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు… డ్రైవర్ దేవ్ రాజ్ కాలేను అదుపులోకి తీసుకున్నామని, మహిళా కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Read More : ముంబైలో అత్యంత ఖరీదైన గణపతి

One thought on “సతారాలో మద్యం మత్తులో ఆటో డ్రైవర్ దౌర్జన్యం !”
Comments are closed.