అహ్మదాబాద్‌లో నిన్న భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుని దేశాన్ని విషాదంలో ముంచింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కింద ఉన్నవారితో కలిపి మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న 242 మందిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగతా ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) కూడా ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తును ఆదేశించింది. తుదిపరిస్థితులు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ విషాదకర ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని ఆయన ఈ రోజు సందర్శించనున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
Read More : ఢిల్లీలో రైలు ప్రమాదం

2 thoughts on “అహ్మదాబాద్ విమాన ప్రమాదం: PM”
Comments are closed.