రాబిన్‌హుడ్ ‘అదిదా’ వివాదం.. కేతికా క్లారిటీ ఇచ్చింది!

Adida Surprise Song controversy

నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రం విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో కేతికా శర్మ నటించిన స్పెషల్ సాంగ్ ‘అదిదా సర్ప్రైజ్’ కొన్ని డాన్స్ స్టెప్స్‌ వల్ల వివాదాస్పదంగా మారింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటపై నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.

ఈ పాటలోని స్టెప్స్ మహిళలను అవమానకరంగా చూపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించి, సుమోటోగా కేసు నమోదు చేసింది. అనంతరం నిర్మాతలు వెంటనే స్పందించి, థియేటర్ వెర్షన్‌తో పాటు యూట్యూబ్ లిరికల్ వీడియోలలోనూ వివాదాస్పద భాగాలను తొలగించారు.

ఈ వివాదంపై కేతికా శర్మ స్పందిస్తూ, తాను దర్శకుడి సూచనల మేరకే నటించానని, ఒక నటిగా దర్శకుడికి పూర్తిగా సరెండర్ అవుతానని వివరణ ఇచ్చింది. సాంగ్‌కు వచ్చిన మిశ్రమ స్పందనపై అవగాహన ఉందని, సినిమా అనేది ఆడియన్స్ కోసం తయారుచేసే ప్రోడక్ట్ మాత్రమేనని తెలిపారు.

ఈ వివాదం నేపథ్యంలో ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్‌లో గ్లామర్ ప్రాధాన్యత, అసభ్యకర స్టెప్స్‌ వంటి అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. ‘డాకు మహారాజ్’ లోని ‘డబిడి డిబిడి’ పాట కూడా ఇటీవలి కాలంలో విమర్శలకు లోనైంది. అయితే, ‘రాబిన్‌హుడ్’ చిత్ర బృందం విమర్శలను సీరియస్‌గా తీసుకుని చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read More

One thought on “రాబిన్‌హుడ్ ‘అదిదా’ వివాదం.. కేతికా క్లారిటీ ఇచ్చింది!

Comments are closed.