జె.వి.ఏ.ఎస్ రీ రిలీజ్ హంగామా: ముగ్గురు దిగ్గజాల కలయిక!

JVAS Re-release Chiranjeevi Movie

మెగాస్టార్ చిరంజీవి నటించిన కల్ట్ క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (జె.వి.ఏ.ఎస్) సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రం మొదటిగా విడుదలైన తేదికే 3D మరియు 4K రిజల్యూషన్‌లో రీ రిలీజ్ అవుతోంది. మూడు దశాబ్దాల తర్వాత కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్సాహం తారాస్థాయిలో ఉంది.

రీ రిలీజ్ సందర్భంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, హీరో మెగాస్టార్ చిరంజీవి కలిసి సందడి చేశారు. వీరి ముగ్గురి మళ్లీ కలవడం, జె.వి.ఏ.ఎస్ సినిమాతో ఉన్న జ్ఞాపకాలను తిరిగొచ్చేలా చేసింది. వైజయంతి మూవీస్ టీం భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

జె.వి.ఏ.ఎస్ టీమ్ ప్రత్యేక టీ-షర్ట్స్, పోస్టర్లు విడుదల చేస్తూ సినిమాకు బజ్ క్రియేట్ చేస్తున్నారు. మెగా అభిమానులు ఈ రీ రిలీజ్‌ను పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు. చిరంజీవి కెరీర్‌లో ఈ సినిమాను నెంబర్ 1గా భావించే ఫ్యాన్స్, మరోసారి థియేటర్లలో అదే జోష్‌ను చూపించేందుకు రెడీగా ఉన్నారు.

ఫాంటసీ సినిమా జోనర్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఒక మైలురాయి. అప్పట్లో వర్షాల కారణంగా మొదటి రెండు రోజులు పరిమితంగా ఆడినా, తర్వాత భారీ రికార్డులతో దూసుకెళ్లింది. ఇప్పుడు రీ రిలీజ్ సందర్భంగా మళ్లీ ఆ రోజులు గుర్తు చేస్తూ మెగా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

Read More

One thought on “జె.వి.ఏ.ఎస్ రీ రిలీజ్ హంగామా: ముగ్గురు దిగ్గజాల కలయిక!

Comments are closed.