రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున భయానక రోడ్డుప్రమాదం జరిగింది. ఉదయం 3 గంటల ప్రాంతంలో ఓ కారు లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. మృతులను మాలోత్ చందులాల్ (29), గగులోత్ జనార్దన్ (50), కావలి బాలరాజు (40)గా గుర్తించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More : కేవలం కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్ట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత

One thought on “ఆదిభట్ల వద్ద ఘోర రోడ్డుప్రమాదం”
Comments are closed.