ట్రెడిషనల్ లుక్‌లో అదా శర్మ.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ ఫోటోలు

Ada Sharma Traditional Look

బాలీవుడ్ అందాల తార అదా శర్మ తన గ్లామర్‌తో, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘1920’ హారర్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ, ఆ తర్వాత ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసినప్పటికీ, పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక టాలీవుడ్‌కు దూరమైంది. అయితే, కోలీవుడ్, బాలీవుడ్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

ప్రస్తుతం అదా శర్మ తన కొత్త ఫోటోషూట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. లెహెంగాలో ట్రెడిషనల్ లుక్‌లో ఈ భామ ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ఎలిగెంట్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

గతంలో ‘కేరళ స్టోరీ’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, సినిమాలకంటే ఎక్కువగా తన స్టన్నింగ్ ఫోటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. అప్పుడప్పుడూ హాట్ అండ్ గ్లామరస్ ఫోటోషూట్స్‌తో మెస్మరైజ్ చేసే అదా శర్మ, ఈసారి సంప్రదాయ చీరలో తన కొత్త అందాన్ని ఆవిష్కరించింది.

తన వయ్యారాన్ని ఒలికిస్తూ దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. టాలీవుడ్‌లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ అందాల భామ త్వరలో తెలుగు తెరపై మరోసారి సందడి చేస్తుందేమో చూడాలి!

Read More

One thought on “ట్రెడిషనల్ లుక్‌లో అదా శర్మ.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ ఫోటోలు

Comments are closed.