ఇప్పుడు థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి రావడం సాధారణమైపోయింది. హారర్, మిస్టరీ థ్రిల్లర్, రొమాంటిక్ చిత్రాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో భారీ స్పందన పొందుతున్నాయి. ఈ క్రమంలో ఆసక్తికరమైన సస్పెన్స్ థ్రిల్లర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే – “సైలెన్స్: క్యాన్ యూ హియర్ ఇట్?” (Silence: Can You Hear It?). దాదాపు 2 గంటల 16 నిమిషాల పాటు ఊహించని ట్విస్టులు, టెన్షన్ సన్నివేశాలతో నరాలు తెగేలా చేస్తుంది. ఈ థ్రిల్లింగ్ మూవీ క్లైమాక్స్ చూసిన తర్వాత గుండె బరువెక్కేలా చేస్తుంది.
బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రాచీ దేశాయ్, అర్జున్ మాథుర్ కీలక పాత్రల్లో మెప్పించారు. దర్శకుడు అబాన్ భరుచా డియోహన్స్ తన దర్పణం చూపిన కథనం, స్టోరీటెల్లింగ్ విధానం సినిమా ఆకర్షణను మరింత పెంచాయి. నెమ్మదిగా సాగిన కథ చివరి వరకు అంచనాలు మించి సస్పెన్స్‌ని నిలుపుకుంటూ, షాకింగ్ మలుపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రతి పాత్రకు ప్రాణం పోశారు అన్న భావన కలిగించే నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
ఈ కథ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో ఒక అమ్మాయి శవమై కనిపించడంతో పోలీస్ ఆఫీసర్ హత్య కేసును తీసుకుంటాడు. స్పష్టమైన ఆధారాలు లేకుండా, నిజాన్ని రాబట్టడానికి అతడికి కేవలం 7 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్, 2024లో విడుదలై భారీ విజయాన్ని సాధించి, ప్రస్తుతం జీ5 (Zee5)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఊహించని ట్విస్టులతో మైండ్-బ్లోయింగ్ ఎండ్ కలిగించే ఈ చిత్రం తప్పక చూడాల్సిందే!

One thought on “ఊహించని ట్విస్టులతో నరాలు తెగే సస్పెన్స్ థ్రిల్లర్ – “సైలెన్స్: క్యాన్ యూ హియర్ ఇట్?”
Comments are closed.