జగ్గారెడ్డి సినీరంగ ప్రవేశం: ‘వార్ ఆఫ్ లవ్’తో ఎంట్రీ

jaggareddy

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Congress Working President Jaggareddy) అనూహ్య ప్రకటన చేశారు. త్వరలో సినీ రంగంలో అడుగు పెట్టనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… ఒక ప్రేమకథా చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. మాఫియాను ఎదురించి ఆడపిల్ల పెళ్లి చేసే వ్యక్తిగా తన పాత్ర ఉంటుందని వెల్లడించారు.

సినిమా కథ వినడానికి ఉగాది సందర్భంగా సమయం కేటాయించనున్నట్లు, వచ్చే ఉగాదికి సినిమా పూర్తవుతుందని తెలిపారు. పీసీసీ, సీఎం అనుమతి తీసుకుని నటిస్తానని స్పష్టం చేశారు. తన తొలి సినిమా టైటిల్ ‘జగ్గారెడ్డి… వార్ ఆఫ్ లవ్’ అని ప్రకటించారు.

రాజకీయ అంశాలపై స్పందన

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై స్పందించిన జగ్గారెడ్డి, తనకు షాక్‌కు గురయ్యానని, కాలమే దీనికి సమాధానం చెబుతుందని అన్నారు. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభను తానే ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం కమ్మ సామాజిక వర్గానికి చెందిన జట్టి కుసుమ పేరును అధిష్టానానికి సూచించినట్లు తెలిపారు. ఈ అంశంపై మాట్లాడేందుకే ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడించారు.

Read More