ప్రియాంక ఆస్తులు అమ్మకం.. కోట్లు దక్కించుకున్న ఆమె!

ప్రియాంక ఆస్తులు అమ్మకం

బాలీవుడ్ నుండి హాలీవుడ్‌ వరకు విభిన్న భాషల చిత్రాల్లో నటించి గ్లోబల్‌ స్టార్‌గా అవతరించిన ప్రియాంక చోప్రా, ప్రస్తుతం వ్యక్తిగత, వృత్తి సంబంధిత విషయాల్లో కూడా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ప్రియాంక తన ముంబయిలోని విలాసవంతమైన ఫ్లాట్లను విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రియాంక చోప్రా తన ఫ్లాట్లను వెస్ట్ ముంబయి అంథేరిలో ఉన్న ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌ లోని నాలుగు విలాసవంతమైన ఫ్లాట్లను రూ.16.17 కోట్లకు విక్రయించారు. ఈ ఫ్లాట్లలో మూడు 18వ అంతస్తులో ఉన్నాయి, వాటి ధరలు రూ.3.45 కోట్లు, రూ.2.85 కోట్లు, రూ.3.52 కోట్లు కాగా, 19వ అంతస్తులో ఉన్న జోడీ యూనిట్‌ రూ.6.35 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.

అంతేకాదు, 2021లో ప్రియాంక చోప్రా వెర్సోవాలోని రెండు ఆస్తులను, 2023లో లోఖండ్‌వాలాలోని రెండు పెంట్ హౌసులను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ప్రియాంక ప్రస్తుతం గోవా, న్యూయార్క్‌, లాస్‌ఏంజెలెస్‌లో సొంత ఆస్తులను కలిగి ఉన్నాయి.

ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌ లో “హెడ్స్ ఆఫ్ స్టేట్”, “ది బ్లఫ్” చిత్రాల్లో నటిస్తూ, “సిటడెల్” అనే సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ చిత్రంలో నటిస్తున్నది, ఇది ఒడిశాలో షూటింగ్ జరుగుతోంది.

ప్రియాంక ఇలాంటి ఆస్తుల విక్రయంతో ఫైనాన్షియల్‌ జాబితాల్లోనే కాకుండా, సినిమా రంగంలో కూడా తన ప్రాభవాన్ని నిలబెట్టుకుంటోంది.

Read More