కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ అనేక వివాదాల నడుమ జనవరిలో విడుదలైంది. తాజాగా, ఈ చిత్రాన్ని చూశిన నటి, రాజకీయ నాయకురాలు రమ్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
రమ్య మాట్లాడుతూ, “కంగనారనౌత్ మంచి నటి అని ఎలాంటి సందేహం లేదు. కానీ ఆమె దర్శకత్వంలో రూపొందించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా చాలా చెత్తగా ఉంది. అందుకే ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. గతంలో ‘మణికర్ణిక’ చిత్రాన్ని కంగనా తెరకెక్కించినప్పుడు, ఆ సినిమా కంటెంట్ బాగుండడంతో ప్రేక్షకులు దాన్ని సఫలంగా స్వీకరించారు” అన్నారు.
‘ఎమర్జెన్సీ’ సినిమా, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందించబడింది. కంగనా ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తూ, దర్శకత్వం, నిర్మాణం కూడా చేపట్టారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ జయప్రకాష్ నారాయణ్ పాత్రలో, శ్రేయస్ తల్పడే అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో కనిపించారు.
ఈ సినిమాను పలు సార్లు వాయిదా వేయగా, 2025 జనవరి 17న విడుదలై మిక్స్‌డ్ రివ్యూస్‌ను అందుకుంది.

One thought on “కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమా పై రమ్య అభిప్రాయాలు”
Comments are closed.