సైబర్ నేరగాళ్లు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త రకం ఫిషింగ్ స్కామ్ (Phishing Scam)ను అమలు చేస్తున్నారు. ఈ స్కామ్‌లో భాగంగా వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ అధికారిక ఇమెయిల్లా కనిపించే మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌లలో “మీ చెల్లింపు ప్రక్రియ విఫలమైంది” అనే భయపెట్టే సందేశాలను చేరవేస్తున్నారు.
ఈ మెయిల్లను చూసిన వినియోగదారులు తక్షణమే వారి చెల్లింపు వివరాలను అప్డేట్ చేయాలనే విధంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. మోసగాళ్లు అందించిన లింక్‌లు నెట్‌ఫ్లిక్స్ అధికారిక వెబ్‌సైట్‌కు చెందినవి అనిపించేలా ఉండే విధంగా రూపొందిస్తున్నారు. కానీ అవి పూర్తిగా నకిలీ లింక్‌లు కావడంతో, వినియోగదారులు తమ బ్యాంక్ వివరాలు లేదా క్రెడిట్ కార్డ్ సమాచారం అందించిన వెంటనే, ఆ వివరాలను సైబర్ నేరగాళ్లు దొంగిలించి అక్రమ లావాదేవీలకు ఉపయోగించే ప్రమాదం ఉంది.
నిపుణుల సూచన మేరకు, నెట్‌ఫ్లిక్స్ లేదా ఇతర సేవల నుండి వచ్చిన సందేశాల్లో లింక్‌లు అనుమానాస్పదంగా అనిపిస్తే, వాటిని నేరుగా క్లిక్ చేయకుండా సంబంధిత సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలను తనిఖీ చేయాలి. అలాగే, ఎలాంటి సందేహాస్పద మెయిల్ వచ్చినా, ఆ సంస్థ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి స్పష్టత పొందాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 thoughts on “నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు – కట్టుదిట్టమైన ఫిషింగ్ స్కాం!”
Comments are closed.