హైదరాబాద్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డులో (ఓఆర్‌ఆర్) రావిర్యాల వద్ద ఉన్న టాటా ఇంటర్‌చేంజ్ నుంచి ఫ్యూచర్ సిటీ గుండా ఆమన్‌గల్ వద్ద ప్రతిపాదిత ప్రాంతమైన రీజినల్ రింగ్ రోడ్డుకు (ఆర్‌ఆర్‌ఆర్) కలుపుతూ నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రహదారికి రాష్ట్ర ప్రభుత్వం “రతన్ టాటా రోడ్డు” అనే పేరును ఖరారు చేసింది. ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం రూ.4,030 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది.
41.50 కి.మీ. పొడవుతో ఈ రహదారి నిర్మాణాన్ని రెండు విడతల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో కీలకమైన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి, రెండో దశలో పూర్తి స్థాయి అభివృద్ధి చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ నగరానికి మరింత మెరుగైన కనెక్టివిటీ లభించనున్నది. రహదారి నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ట్రాఫిక్ భారం తగ్గడంతో పాటు, పారిశ్రామిక వృద్ధికి ఊతమివ్వనుంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాలకు మెరుగైన రవాణా మార్గం అందుబాటులోకి రానుంది.

One thought on “రూ.4,030 కోట్లతో 41.50 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ రహదారి”
Comments are closed.