ఏపీ శాసనమండలిలో వాగ్వాదం.. వైసీపీ ఎమ్మెల్సీలకు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్!

Lokesh

ఏపీ శాసనమండలిలో కూటమి సభ్యులు, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అంశంపై తీవ్ర చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ ఘాటుగా ప్రతిస్పందించారు.

వైసీపీ-కూటమి ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం

అమరావతి, ఫిబ్రవరి 25: ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) హీట్ పెరిగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మాన చర్చలో భాగంగా, కూటమి సభ్యులు, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యంగా ఉద్యోగాల కల్పన అంశం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ ప్రసంగంలోని తెలుగు, ఇంగ్లీష్ వర్షన్ల మధ్య తేడా ఉందని వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి ప్రశ్నించగా, ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.The YSRCP MLCs said that it was clear in the Governor’s speech that they had created four lakh jobs.

లోకేష్ క్లారిటీ

దీనిపై మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) స్పందిస్తూ, “మేము ఉద్యోగాలను భర్తీ చేశామని ఎక్కడా చెప్పలేదు. ఉద్యోగ అవకాశాలను సృష్టించామని మాత్రమే స్పష్టంగా పేర్కొన్నాం” అంటూ సమాధానమిచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీలు వాస్తవాలను అర్థం చేసుకొని మాట్లాడాలని హితవు పలికారు. “ఇంగ్లీష్ మీడియం కావాలని అంటారు.. మళ్లీ ఇంగ్లీష్‌లో చెప్తే ఇబ్బంది అంటారు” అంటూ లోకేష్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తప్పులుంటే సవరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు.

లోకేష్ వార్నింగ్

టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. “మార్క్ మై వర్డ్స్.. చట్టాలను ఉల్లంఘించిన ప్రతి ఒక్కరు లోపలికే” అంటూ ఘాటుగా హెచ్చరించారు.

తెలుగును అవమానించిన వైసీపీ ఎమ్మెల్సీ?

ఇంగ్లీష్ మీడియం అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. “ఇంగ్లీష్ మీడియం లేకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఎలా వస్తాయి?” అని ప్రశ్నించగా, హోంమంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. తెలుగులో చదువుకున్నవారు ఎన్నో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. వైసీపీ సభ్యులు తాము మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read More