కష్టకాలంలో నాకు అండగా నిలిచిన ప్రభాస్

Writer Thota Prasad

కష్టకాలంలో ప్రభాస్ అండగా నిలిచారు – కన్నప్ప రైటర్ తోట ప్రసాద్

సినిమా ఇండస్ట్రీలో మంచి మనసున్న వ్యక్తిగా పేరున్న రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కన్నప్ప సినిమా రచయిత తోట ప్రసాద్ ఓ భావోద్వేగ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. 2010లో మహాశివరాత్రి రోజున తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన సంగతిని వెల్లడించారు. అదే రోజు ప్రభాస్ తండ్రి యూ.సూర్యనారాయణ రాజు గారు అనారోగ్యంతో కన్నుమూశారని, ఇది తన జీవితంలో ఓ విచారకర ఘటనగా మిగిలిందన్నారు.

తాను ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని ప్రభాస్ తెలుసుకుని తన వ్యక్తిగతంగా సహాయం అందించారని, ఆ ఆపద సమయంలో ఆర్థికంగా కూడా అండగా నిలిచారని చెప్పారు. ఒక తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, తనను తలచుకుని స్పందించిన తీరు ప్రభాస్ హృదయ విశాలతకు నిదర్శనమని అన్నారు.

“తన ఇంట్లోనే విషాదం చోటుచేసుకున్నా, ఎదుటివారికి సహాయం చేయాలనే మంచి మనస్సు ప్రభాస్ గారికి ఉంది. నేను ఓ రచయితగా, తనకు పరిచయం ఉన్న వ్యక్తిగా, నా పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించడం, నన్ను ఆదుకోవడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం” అని తోట ప్రసాద్ తెలిపారు.

సినిమా పరిశ్రమలో ప్రభాస్ మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ముందుండే ఓ నిజమైన మానవతావాది అని తోట ప్రసాద్ కితాబిచ్చారు.

Read More

One thought on “కష్టకాలంలో నాకు అండగా నిలిచిన ప్రభాస్

Comments are closed.