పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకుని, కుటుంబంతో కలిసి శనివారం సాయంత్రం సింగపూర్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇటీవల మార్క్ శంకర్ సింగపూర్ లోని తన స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
ఈ నెల 8 న జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్ గొంతు, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో తీవ్రంగా అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో అతడిని వెంటనే సింగపూర్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. వైద్యులు నాలుగు రోజులపాటు అత్యవసర చికిత్స అందించి, బ్రాంకోస్కోపీ ప్రక్రియ నిర్వహించారు.
కుమారుడి పరిస్థితి తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి ఏప్రిల్ 9 న హుటాహుటిన సింగపూర్ కి వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగు పడుతుండటంతో, పూర్తిగా కోలుకున్న వెంటనే హైదరాబాద్ కు తిరిగివచ్చారు.
పవన్ కుటుంబం మార్క్ ఆరోగ్యం కాపాడిన వైద్య బృందానికి కృతఙ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉండటం అభిమానులకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

2 thoughts on “సింగపూర్ హాస్పిటల్ నుంచి నేరుగా హైదరాబాద్ కు పవన్ ఫ్యామిలీ”
Comments are closed.