హైదరాబాద్‌లో హైడ్రా బలోపేతం కావాలి: భూ కబ్జా బాధితుల విజ్ఞప్తి

Hyderabad: హైడ్రా మరింత బలపడాలి

హైదరాబాద్: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన **హైడ్రా (HYDRA)**ను మరింత పటిష్టం చేయాలని పలువురు భూ కబ్జాదారుల బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంవత్సరాలుగా కబ్జాదారుల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలకు హైడ్రా మంచి పరిష్కారం చూపిస్తోందని వారు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో నగరం, శివారు ప్రాంతాలకు చెందిన బాధితులు నాగేశ్వరరావు, సాయికుమార్, చంద్రశేఖర్, తనూజ, శ్రీనాథ్, గాయత్రి, నవీన్ కుమార్ పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు ఆన్‌లైన్‌లో వేధింపులు..

రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా వంటి మంచి వ్యవస్థను ఏర్పాటు చేసిందని, కబ్జాదారుల బారి నుంచి తమను రక్షిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, కొంత మంది కబ్జాదారులు హైడ్రా పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా హైడ్రా, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు సాగుతుందని తెలిపారు.

పార్కులు, చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన బాధితులపై కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని, సీఎం స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఈ మేరకు తమకు హైడ్రా చేసిన మేలును, కబ్జాదారులు వేధింపులను వివరించారు. ఈ కార్యక్రమంలో దివ్యనగర్, కోహెడ, అమీన్‌పూర్, నాగిరెడ్డి చెరువు, ముత్తంగి, బడంగ్‌పేట్ తదితర ప్రాంతాల్లో హైడ్రా వల్ల లబ్ధి పొందిన వారు పాల్గొన్నారు.

Read More

One thought on “హైదరాబాద్‌లో హైడ్రా బలోపేతం కావాలి: భూ కబ్జా బాధితుల విజ్ఞప్తి

Comments are closed.