శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుంచి (ఫిబ్రవరి 19) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు మార్చి 1 వరకు 11 రోజుల పాటు జరుగనున్నాయి. భక్తుల కోసం ఆలయ అధికారులు విశేష ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించబడింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి చేరుకుంటున్నారు. పాదయాత్ర భక్తులకు ప్రత్యేక షెడ్లు, తాగునీటి సదుపాయం, మెరుగైన రహదారులు ఏర్పాటు చేశారు. ఆలయంలో ప్రత్యేక దర్శన క్యూలైన్లు, ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముఖ్య కార్యక్రమాలు:
ఫిబ్రవరి 19 – యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ
ఫిబ్రవరి 20 – భృంగివాహన సేవ
ఫిబ్రవరి 21 – హంస వాహన సేవ
ఫిబ్రవరి 22 – మయూర వాహన సేవ
ఫిబ్రవరి 23 – రావణ వాహన సేవ
ఫిబ్రవరి 24 – పుష్పపల్లకీ సేవ
ఫిబ్రవరి 25 – గజవాహన సేవ
ఫిబ్రవరి 26 – నందివాహన సేవ, రుద్రాభిషేకం, బ్రహ్మోత్సవ కల్యాణం
ఫిబ్రవరి 27 – రథోత్సవం, తెప్పోత్సవం
ఫిబ్రవరి 28 – యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణ
మార్చి 1 – అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం
భక్తులకు పట్టువస్త్రాల సమర్పణ:
ఫిబ్రవరి 19 – శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం
ఫిబ్రవరి 20 – ద్వారకా తిరుమల
ఫిబ్రవరి 21 – విజయవాడ ఇంద్రకీలాద్రి
ఫిబ్రవరి 22 – ఉదయం కాణిపాకం, సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం
ఫిబ్రవరి 23 – ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
