“హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డికి చుక్కెదురు: క్వాష్ పిటిషన్ కొట్టివేత”

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి చుక్కెదురైంది. లగచర్ల దాడి ఘటనలో తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నరేందర్ రెడ్డికి కొట్టిపారేసింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై ఈ రోజు (బుధవారం) న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే, హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసి, నరేందర్ రెడ్డికి బెయిల్‌ పై జిల్లా కోర్టును తిరిగి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

లగచర్ల దాడి ఘటనలో అరెస్టయిన నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఆరోపణలు నేపథ్యంలో, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను ఏ-1 నిందితుడిగా గుర్తించిన అధికారులు గత నెలలో ఆయనను అరెస్టు చేశారు.