ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 4,46,558 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా, అధికారులు ఔట్ ఫ్లోను పెంచుతున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరుకుంది.
10 గేట్లు ఎత్తివేత:
జలాశయానికి వరద ఉధృతి పెరగడంతో, అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీటితో నాగార్జున సాగర్ జలాశయానికి ప్రవాహం పెరుగుతోంది. ఈ వరద ప్రవాహం ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రాజెక్టులో ప్రస్తుత నీటి వివరాలు:
- ఇన్ ఫ్లో: 4,46,558 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో: 4,45,630 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటిమట్టం: 885 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం: 884.20 అడుగులు
- పూర్తి స్థాయి నీటి నిల్వ: 215.81 టీఎంసీలు
- ప్రస్తుత నీటి నిల్వ: 214.24 టీఎంసీలు
Read More : భారీ వర్షాలకు ధ్వంసమైన రైల్వే ట్రాక్

2 thoughts on “శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద: 10 గేట్లు ఎత్తివేత.”
Comments are closed.