ఉల్లి పంటపై రైతులకు సహాయం అందించేందుకు వెంటనే కొనుగోలు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈరోజు నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున ఉల్లిని రైతుల వద్ద నుంచే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు చేసిన ఉల్లిని కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేసి ఆరబెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వచ్చే పది రోజుల్లో ఐదువేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట రాబోతుందని, రైతుల నష్టాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. రైతు బజార్లను విస్తరించి ఆధునికీకరించాలని, అన్ని పంటలకు వేర్‌హౌసింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ఇక రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, మెగా పార్కులు, టూరిజం, విద్యుత్, ఎలక్ట్రానిక్స్ రంగాల ప్రతిపాదనలపై చర్చించారు. SIPB ఆమోదం పొందిన పెట్టుబడులు రూ.53,922 కోట్లు కాగా, వీటి ద్వారా 83,437 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం ప్రకటించారు.
సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని సూచించారు. ఈ కార్డుల్లో ప్రభుత్వం అందించే పథకాల వివరాలు పొందుపరుస్తామని తెలిపారు. ప్రతి కుటుంబ అవసరాలను గుర్తించి పథకాలను చేరువ చేసే విధంగా ఈ వ్యవస్థను అమలు చేయాలని ఆయన ఆదేశించారు. త్వరలోనే జనాభా విధానం (Population Policy) తీసుకురాబోతున్నట్టు సీఎం స్పష్టం చేశారు.
ప్రభుత్వ సంక్షేమం అందరికీ సమానంగా అందేలా కుటుంబాల విభజనను అరికట్టి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించేలా ఫ్యామిలీ కార్డులు రూపకల్పన చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.
Read More : పోలీస్ స్టేషన్ ఎదుట వికలాంగుల ప్రేమ వివాహం

One thought on “ఫ్యామిలీ కార్డు పై సీఎం కీలక నిర్ణయాలు.”
Comments are closed.