అమెరికా ప్రభుత్వం భారత్ నుంచి దిగుమతి అయ్యే పలు కీలక వస్తువులపై 50 శాతం మేర టారిఫ్‌లు విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం రేపటి నుంచి (ఆగస్టు 27) అమలులోకి వస్తుంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం, ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతుందని, అదే సమయంలో చైనా, వియత్నాం, మెక్సికో, టర్కీ, పాకిస్తాన్ వంటి ఇతర దేశాలకు అమెరికా మార్కెట్‌లో అవకాశాలు సుగమం అవుతాయని హెచ్చరిస్తోంది.
భారత్ ఎగుమతులపై ఈ కొత్త టారిఫ్‌ల ప్రభావం సుమారు 60.2 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై పడుతుంది. మొత్తం ఎగుమతులలో 66 శాతం ప్రాబల్యం ఉన్న ఈ టారిఫ్‌ల కారణంగా, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి అమెరికాకు భారత ఎగుమతులు 49.6 బిలియన్ డాలర్లకు పడిపోవచ్చని జీటీఆర్ఐ అంచనా వేశింది. ముఖ్యంగా వస్త్రాలు, కార్పెట్లు, ఫర్నిచర్ రంగాల్లో 70 శాతం వరకు తగ్గుదల నమోదవుతుందని, ఇది లక్షలాది ఉద్యోగాలపై ప్రభావం చూపవచ్చని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
అంతేకాక, ఈ పరిణామాల కారణంగా 2026 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.5% నుంచి 5.6%కి పడిపోవచ్చని జీటీఆర్ఐ అంచనా వేసింది. అమెరికా భారత్‌కు పెద్ద వాణిజ్య భాగస్వామి అయినప్పటికీ, ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థ పోటీతత్వం, ప్రపంచ సరఫరా గొలుసులో స్థానానికి సవాలు కలిగిస్తాయి. నిపుణులు, ఈ నష్టాన్ని తగ్గించేందుకు భారత్ తక్షణ వ్యూహాత్మక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని సూచిస్తున్నారు.
Read More : డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన ఫిఫా అధ్యక్షుడు

One thought on “అమెరికా టారిఫ్‌ల పెంపు: భారత్ ఎగుమతులకు ముప్పు”
Comments are closed.