దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు.

హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగనుండటంతో రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. చర్లపల్లి-తిరుపతి ప్రత్యేక వీక్లీ రైలు (07011) సెప్టెంబరు 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం నడవనుంది. దీని తిరుగు ప్రయాణ రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. ఈ రైలు మల్కాజ్‌గిరి, కాచిగూడ, షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల, కర్నూలు సిటీ, యర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

తిరుపతి-హిసర్‌ ప్రత్యేక రైలు (07717) అక్టోబరు 1 నుంచి నవంబరు 26 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. తిరుగు రైలు (07718) అక్టోబరు 5 నుంచి నవంబరు 30 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఈ రైలు రేణిగుంట, కడప, గుత్తి, నిజామాబాద్‌, నాందేడ్‌, అకోలా, భిల్వారా, అజ్మీర్‌, సికర్‌ వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా వెళ్తుంది. అలాగే నాందేడ్‌-ధర్మవరం ప్రత్యేక రైలు (07189) సెప్టెంబరు 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. దీని తిరుగు రైలు (07190) సెప్టెంబరు 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఈ రైలు నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కదిరి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

బెంగళూరు-బీదర్‌ ప్రత్యేక రైళ్లు (06549, 06550, 06530, 06540) సెప్టెంబరు 5 నుంచి 29 వరకు శుక్ర, శని, ఆదివారాలు, సోమవారాల్లో నడుస్తాయి. ఈ రైళ్లు యల్హంక, ధర్మవరం, అనంతపురం, రాయచూరు, కలబురగి వంటి మార్గాల్లో ప్రయాణిస్తాయి. అదేవిధంగా యశ్వంతపూర్‌-ధన్‌బాద్‌ ప్రత్యేక రైలు (06563) సెప్టెంబరు 23 నుంచి డిసెంబరు 27 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. తిరుగు రైలు (06564) సెప్టెంబరు 25 నుంచి డిసెంబరు 29 వరకు నడుస్తుంది. ఈ రైలు కాచిగూడ, రామగుండం, నాగపూర్‌, కట్ని, గయ వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్ల వివరాలను ప్రకటిస్తూ, పండుగ సీజన్‌లో ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

Read More : తిరుపతి సంచలనం: నమ్మకద్రోహం చేసిన కేర్ టేకర్ హత్య