తిరుపతి సంచలనం: నమ్మకద్రోహం చేసిన కేర్ టేకర్ హత్య

తిరుపతిలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధుడిని చూసుకోవడానికి నియమించుకున్న కేర్ టేకర్, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా తీసుకొని వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రేణిగుంట రోడ్డులోని సీపీఐర్ విల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శివ ఆనంద్ తన తండ్రి షణ్ముగం, మేనత్త ధనలక్ష్మిలతో నివసిస్తున్నాడు. షణ్ముగం పక్షవాతం రావడంతో స్థానిక ఏజెన్సీ ద్వారా రవిని కేర్ టేకర్‌గా నియమించారు. ఏజెన్సీకి నెలకు రూ.25 వేల చెల్లిస్తుండగా, రవికి కేవలం రూ.15 వేలే అందుతున్నాయి. దీంతో అసంతృప్తి చెందిన రవి ఉద్యోగం మానేశాడు. అయితే, అతనిపై నమ్మకం పెంచుకున్న శివ, నేరుగా నెలకు రూ.22 వేల జీతం ఇస్తానని చెప్పి తిరిగి అతడినే కేర్ టేకర్‌గా కొనసాగించాడు.

శుక్రవారం శివ హైదరాబాద్‌లో మీటింగ్‌కు వెళ్ళగా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రవి, ఇంట్లో నిద్రిస్తున్న ధనలక్ష్మిని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఆమె చెవుల్లో ఉన్న 8 గ్రాముల బంగారు కమ్మలు తీసుకుని పరారయ్యాడు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రవి హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ దారుణంతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

Read More : నేడు పెద్దాపురంలో సీఎం పర్యటన

One thought on “తిరుపతి సంచలనం: నమ్మకద్రోహం చేసిన కేర్ టేకర్ హత్య

Comments are closed.