తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు యూరియా అందించే బాధ్యత తమదేనని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతపై ఆయన స్పందిస్తూ, ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అసత్య ప్రచారమని కొట్టిపారేశారు.
‘ఆపరేషన్ సింధూర్’ వల్లే కొరత:
యూరియా కొరతకు కారణం ‘ఆపరేషన్ సింధూర్’ అని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ ఆపరేషన్ కారణంగా యూరియా అక్రమ రవాణా తగ్గిందని, దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో యూరియా నిల్వలు నిలిచిపోయాయని తెలిపారు. “రైతులకు కలిగిన కొంత అసౌకర్యానికి చింతిస్తున్నాం. రైతులు ఎవరి మాటలో నమ్మి అనవసరంగా ధర్నాలు చేయకండి,” అని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాటలు నమ్మవద్దని రైతులకు సూచించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.
Read More : కూకట్‌పల్లి సహస్ర హత్య మిస్టరీ ఛేదన.

One thought on “రైతులకు యూరియా అందిస్తాం: బీజేపీ ఎంపీ”
Comments are closed.