తమిళనాడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఖాయమని టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో కలిసిపోయి, వారి సమస్యలను అర్థం చేసుకున్న పార్టీగా తాము నిలిచామని, వచ్చే ఎన్నికల్లో అది నిరూపితమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
మన లక్ష్యాలను సాధించడానికి, కలలను నెరవేర్చుకోవడానికి కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని విజయ్ పేర్కొన్నారు. 1967, 1977లో జరిగిన ఎన్నికల ఫలితాల తరహాలోనే 2026లో కూడా చరిత్ర పునరావృతం కానుందని ధైర్యంగా తెలిపారు.
“తమిళ ప్రజలను ప్రాణానికి ప్రాణంగా భావించే నేను, మీ అందరితో కలిసి ఈ విజయాన్ని సాధించబోతున్నాను. అభిమానులు, యువత, మహిళలు, పురుషులు, వృద్ధులు ఇలా అందరూ సమానంగా కృషి చేయాలి. కేవలం ప్రజా సంక్షేమమే మా ధ్యేయం. ప్రజాస్వామ్య పరిపాలనను అందించేందుకు అధికారంలోకి రావడం మా లక్ష్యం” అని విజయ్ పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికలు రాజకీయ యుద్ధమని, అందులో విజయం తమదేనని, తమిళ గడ్డపై సరికొత్త ఫలితాన్ని చూపించడం ఖాయమని విజయ్ ధీమాగా ప్రకటించారు.
Read More : మీరట్ టోల్ ప్లాజా ఘటనపై ఎన్‌హెచ్ఏఐ సీరియస్
