ముంబైలో అత్యంత ఖరీదైన గణపతి

గణేష్ చతుర్థి వేడుకలకు ముంబై ముస్తాబవుతున్న నేపథ్యంలో, అత్యంత ధనవంతుడైన వినాయకుడిగా ప్రసిద్ధి చెందిన జీఎస్బీ సేవా మండల్ గణపతి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాది మండల్ తమ వినాయకుడికి ఏకంగా ₹474 కోట్ల బీమా తీసుకుని రికార్డు సృష్టించింది. ఇది దేశంలోనే అత్యధిక బీమా కలిగిన గణపతిగా నిలిచింది.

గతేడాది ₹400 కోట్లు, 2023లో ₹360 కోట్ల బీమా తీసుకున్న ఈ మండల్, ఈసారి బీమా విలువను మరింత పెంచింది. ఈ భారీ బీమా కేవలం విగ్రహానికే కాకుండా, దానిపై ఉన్న బంగారం-వెండి నగలు, వాలంటీర్లు, పూజారులు, సెక్యూరిటీ గార్డులు మరియు భక్తులకు కూడా వర్తిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ రికార్డు బీమాతో జీఎస్బీ సేవా మండల్ వినాయకుడికి ఉన్న ప్రాధాన్యత మరోసారి నిరూపితమైంది.

Read More : యూపీలో సీఎస్‌ఈ ఇంటి వద్ద కాంగ్రెస్ ఆందోళన

One thought on “ముంబైలో అత్యంత ఖరీదైన గణపతి

Comments are closed.