ఢిల్లీలో విపక్షాల భారీ ర్యాలీ: ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు

బిహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఇండియా’ కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో కేంద్ర ప్రభుత్వానికి, ఈసీకి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.

ర్యాలీలో హైడ్రామా

  • ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఎంపీలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
  • సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు పలువురు మహిళా ఎంపీలు బ్యారికేడ్లను దూకేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.
  • ఈ సందర్భంగా పోలీసులు రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలను అరెస్ట్ చేశారు.

శశి థరూర్ హాజరుపై ఆసక్తి
ఇటీవల కాలంలో కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వచ్చిన ఎంపీ శశి థరూర్ ఈ ర్యాలీలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తూ, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న శశి థరూర్, ఈ ర్యాలీలో కనిపించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది పార్టీలో ఆయన వైఖరిలో మార్పునకు సంకేతమని పలువురు భావిస్తున్నారు.

Read More : కేరళ పోలీసు అధికారికి ప్రశంసలు

One thought on “ఢిల్లీలో విపక్షాల భారీ ర్యాలీ: ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు

Comments are closed.