ఓ మహిళా పోలీసు అధికారి చూపించిన మానవత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. కేరళలోని త్రిశూర్ జిల్లాలో భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు వేగంగా దారి చూపించేందుకు ఏకంగా పరుగులు తీసింది.
వివరాలు:
త్రిశూర్ నగరంలో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అంబులెన్స్ సైరన్ వినిపించింది. అయితే, ట్రాఫిక్ కారణంగా అంబులెన్స్ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. గమనించిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) అపర్ణ లవకుమార్, స్వయంగా వాహనదారులను పక్కకు జరగమని అడుగుతూ, అంబులెన్స్‌కు ముందు పరుగులు తీస్తూ దారి చూపించారు.
సమయానికి ఆసుపత్రికి చేరాల్సిన రోగి ప్రాణాలు కాపాడేందుకు ఆమె చూపించిన చొరవను అక్కడివారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏఎస్ఐ అపర్ణకు సెల్యూట్ చేస్తూ, ఆమె సేవలను కొనియాడుతున్నారు.
Read More : భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి తరలించిన భర్త

One thought on “కేరళ పోలీసు అధికారికి ప్రశంసలు”
Comments are closed.