ప్రకాశం జిల్లా: ఉలవపాడు మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక తుఫాను వాహనం లారీని ఢీకొని బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
Read More :నందిగామ వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు దారుణం: షర్మిల ఆగ్రహం
