హిమాయత్‌ సాగర్‌కు కొనసాగుతున్న వరద

నగరంలోని హిమాయత్‌ సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మరో గేట్‌ను ఎత్తివేశారు. ఇప్పటికే మూడు గేట్లు ఎత్తివేయగా, ఇప్పుడు మొత్తం నాలుగు గేట్లు తెరిచి ఉంచారు.

జలాశయం నుంచి దాదాపు 2500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాలు, వరదల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాటర్‌ బోర్డు అధికారులు కోరారు.

One thought on “హిమాయత్‌ సాగర్‌కు కొనసాగుతున్న వరద

Comments are closed.