సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి వస్తున్న ఓ తెలంగాణ గల్ఫ్ కార్మికుడు విమానంలోనే గుండెపోటుతో మరణించాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్ కొన్ని సంవత్సరాలుగా సౌదీలో పనిచేస్తున్నాడు. స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో ఆయనకు విమానంలోనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.
వెంటనే విమాన సిబ్బంది విమానాన్ని ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వైద్య సిబ్బంది శ్రీధర్‌కు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. శ్రీధర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More : విద్యార్థిని తలపై కొట్టిన టీచర్

One thought on “విమానంలో గుండెపోటుతో గల్ఫ్ కార్మికుడు మృతి”
Comments are closed.