ముంబైలోని థానే-భివండి మెట్రో లైన్ 5 నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోలో వెళ్తున్న అతని తలపై నిర్మాణ స్థలం నుంచి రాడ్ పడింది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
దీనిపై స్పందించిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA), నిర్మాణ సంస్థ అఫ్కాన్స్ ఇన్‌ఫ్రాకు రూ. 50 లక్షల జరిమానా విధించింది. గాయపడిన వ్యక్తి వైద్య ఖర్చులను కంపెనీ భరించాలని, ప్రమాదంపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది.
Read More : రాహుల్ గాంధీకి చాయ్‌బాసా కోర్టు బెయిల్ మంజూరు

One thought on “ముంబై మెట్రో నిర్మాణంలో ప్రమాదం”
Comments are closed.