లీగల్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశానన్న నటుడు!

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలో బ్యాంక్ లావాదేవీలు, ఇతర ఆర్థికపరమైన అంశాలపై అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.

విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ, తాను కేవలం లీగల్ గేమింగ్ యాప్స్ను మాత్రమే ప్రమోట్ చేశానని, అవి బెట్టింగ్ యాప్స్ కావని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలను ఈడీ అధికారులకు అందించానని తెలిపారు. ఈ కేసులో ఆయన ఇచ్చిన సమాధానాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.

Read More : రజనీకాంత్‌ను మెప్పించిన నటన

One thought on “లీగల్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశానన్న నటుడు!

Comments are closed.