అర్ధరాత్రి ట్రంప్ కీలక ప్రకటన: సర్వత్రా ఉత్కంఠ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. భారత కాలమానం ప్రకారం, ఈ రోజు అర్ధరాత్రి 2 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) ఓవల్ ఆఫీసులో ఆయన ఒక ముఖ్యమైన ప్రకటన చేయనున్నారు.

భారత్‌పై సుంకాల గురించి ట్రంప్ గతంలో పదేపదే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఈ ప్రకటన దేని గురించి ఉంటుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రకటన అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More : శ్రీలంక నేవీ మరోసారి భారత జాలర్ల అరెస్ట్