బీసీ రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన 72 గంటల దీక్షకు వాతావరణం, పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఒకవైపు హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుండగా, మరోవైపు దీక్షాస్థలిని ఖాళీ చేయాలంటూ పోలీసులు నాయకులు, కార్యకర్తలపై ఒత్తిడి తీసుకొచ్చారు.
పోలీసులు ఈ చర్యను ఖండించిన బీఆర్ఎస్ శ్రేణులు, దీక్షను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. ఎంత వర్షం వచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కవిత దీక్ష కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. వర్షంలో కూడా కార్యకర్తలు దీక్షాస్థలిలో కవితకు మద్దతుగా నిలిచి నినాదాలు చేశారు. ఈ ఘటనతో దీక్షాస్థలి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read More : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శ – రామచందర్ రావు

One thought on “భారీ వర్షం, పోలీసుల ఒత్తిడి మధ్య కవిత దీక్ష”
Comments are closed.