సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక సందేశం పంపించారు. తన తాజా సినిమా విడుదల సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తెలుగులో మాట్లాడిన ఒక వీడియోను ఆయన విడుదల చేశారు.
ఈ వీడియోలో రజనీకాంత్… “నాకు తెలుగు ప్రేక్షకులంటే చాలా ఇష్టం. నేను నటించిన సినిమాలను మీరు ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్నారు. మీ అందరి ప్రేమ, అభిమానం నాకు చాలా ముఖ్యమైనవి. నా కొత్త సినిమాను కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు. రజనీకాంత్ తెలుగులో మాట్లాడటంతో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలుగులో ఆయన మాట్లాడిన తీరు, అభిమానుల పట్ల చూపించిన గౌరవం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Read More : తిరుమలలో కిరణ్ అబ్బవరం కుమారుడి నామకరణం

2 thoughts on “తెలుగు అభిమానుల కోసం రజనీకాంత్ స్పెషల్ వీడియో”
Comments are closed.