విజయవాడ చేరుకున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల సాధన దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. నాలుగు రోజులపాటు సింగపూర్‌లో పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో కీలక చర్చలు జరిపిన సీఎం చంద్రబాబు నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారు. రాత్రి 11:25 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టిన సీఎంకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో రాష్ట్రానికి గణనీయమైన పెట్టుబడులు, వేలాది ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

సీఎంతో పాటు మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. విమానాశ్రయంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తదితరులు స్వాగతం పలికారు.

ఈ పర్యటన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Read More : నెల్లూరులో జగన్ పర్యటన ఉద్రిక్తం – పోలీసుల లాఠీఛార్జ్